అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే షరద్ పవార్ సంచలన ఆరోపణలు..
మహారాష్ట్ర, 21 ఫిబ్రవరి (హి.స.) మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే షరద్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, అప్పటి వరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా
అజిత్ పవర్ డెత్


మహారాష్ట్ర, 21 ఫిబ్రవరి (హి.స.)

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి

అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే షరద్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, అప్పటి వరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు రోహిత్ పవార్ పీఎం మోడీకి లేఖ రాశారు. ప్రమాదానికి గురైన విమానం వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందినదని, ఈ సంస్థతో విమానయాన మంత్రికి చెందిన రాజకీయ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే మంత్రి పదవిలో ఉండకూడదని అన్నారు.

అంతేకాకుండా ప్రమాదం వెనుక రాజకీయ లేదా వ్యాపారపరమైన కుట్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన కంపెనీని కొందరు శక్తివంతులు కాపాడుతున్నారని అన్నారు. దీనిలో డీజీసీఏ అధికారుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. కేసులో న్యాయం జరగాలంటే అమిత్ షా, మోడీ స్వయంగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రమాదంపై మొదటి నుంచే బ్లాక్ బాక్స్ విషయంలో సందేహాలు వ్యక్తం చేశామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande