యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. రాస్తారోకో
నల్గొండ, 21 ఫిబ్రవరి (హి.స.) యూరియా సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనుక యూరియా సమస్యను పరిష్కరించే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ
యూరియా ధర్నా


నల్గొండ, 21 ఫిబ్రవరి (హి.స.)

యూరియా సకాలంలో అందక

ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనుక యూరియా సమస్యను పరిష్కరించే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యాప్ ద్వారా యూరియా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ను రద్దు చేసి పాత పద్ధతిలో నేరుగా యూరియాను అందజేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande