పార్టీల మధ్య దుమారం రేపిన మున్సిపల్ ఎన్నికలు..
అదిలాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు వివిధ పార్టీల మధ్య రాజకీయ దుమారానికి తెరలేపాయి. మున్సిపల్ ఎన్నికల వరకు వేర్వేరుగా పోటీ చేసిన ప్రధాన పార్టీలు. .చైర్మెన్ల ఎంపికలో మ
ఆదిలాబాద్ మున్సిపల్


అదిలాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు వివిధ పార్టీల మధ్య రాజకీయ దుమారానికి తెరలేపాయి. మున్సిపల్ ఎన్నికల వరకు వేర్వేరుగా పోటీ చేసిన ప్రధాన పార్టీలు. .చైర్మెన్ల ఎంపికలో మాత్రం పొత్తులు పెట్టుకోవడం ఆసక్తి రేపింది. సాధారణంగా పరస్పరంగా విమర్శలు చేసుకునే పార్టీలు తాజా మున్సిపల్ ఛైర్మెన్ ల ఎంపికలో మాత్రం జత కట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కో పార్టీ... ఒక్కో చోట వేర్వేరుగా కలిసిపోవడం ఉమ్మడి జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. బల్దియా కుర్చీ సాధించడమే టార్గెట్ గా చేసుకున్న పార్టీలు తమ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి జతకట్టడం రాజకీయంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఆయా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో విమర్శలు.. ప్రతి విమర్షలతో హీటేక్కించే రాజకీయ పార్టీలు మున్సిపల్ స్థాయిలో మాత్రం కలిసి పని చేయడం..ఆయా పార్టీలకు మద్దతు ఇవ్వడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.

జిల్లాలో హీటెక్కిన రాజకీయం..

ఉమ్మడి జిల్లాలో క్యాతన్ పల్లి, ఖానాపూర్ మినహా మిగితా అన్ని చోట్ల చైర్మెన్ ఎన్నిక పూర్తయింది.కానీ ఆయా పార్టీల మధ్య రాజకీయ వేడి మాత్రం ఇంకా అలాగే ఉంది. ఆయా నేతల మాటల యుద్ధాలతో బల్దియా రాజకీయం హీటేక్కింది. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్నల మధ్య డైలాగ్ వార్ తారా స్థాయికి చేరుకుంది.అదేవిధంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. మంత్రి వివేక్,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మధ్య జరిగిన దుమారం కాస్త అల్లర్లను సృష్టించింది.ఈ ఘటనతో బాల్క సుమన్ ను పోలీసుల అరెస్టు చేసి జైలుకు తరలించేవరకు వెళ్ళింది. దీంతో మంచిర్యాల జిల్లాలో ఇంకా రాజకీయం ఇంకాస్త హీటెక్కింది.వీటితో పాటు మిగితా కొన్ని మున్సిపాలిటిల్లో మాత్రం వివిధ పార్టీల నేతల మధ్య విమర్శలు..ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు పది మున్సిపాల్టీలు ఉన్నాయి.ఇందులో మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టి పేట, నిర్మల్ మున్సిపాల్టీలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సొంతంగా ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పీఠాలు దక్కించుకోగా బెల్లంపల్లిలో స్వతంత్రుల మద్దతుతో పీఠం కైవసం చేసుకుంది.ఇక కాగజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఛైర్మెన్ పీఠం కైవసం చేసుకోగా ఇందుకు బీజేపీ మద్దతు తెలిపింది.ఆదిలాబాద్ లో స్వతంత్ర అభ్యర్థి ఛైర్మెన్ పీఠం దక్కించుకోగా ఇందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్,ఎంఐఎం, స్వతంత్రులు మద్దతు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇక భైంసాలో నూ చైర్మెన్, వైస్ ఛైర్మెన్ గా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నిక కాగా ఇందుకు బీజేపీ కౌన్సిలర్లతో పాటు, ఒక కాంగ్రెస్ సభ్యుడు మద్దతు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande