పరామర్శకు వెళ్తున్న నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మేడ్చల్, 21 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పరామర్శించేందుకు బయల్దేరిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలను
నేతల అరెస్ట్


మేడ్చల్, 21 ఫిబ్రవరి (హి.స.)

కామారెడ్డిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ,

స్థానిక ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పరామర్శించేందుకు బయల్దేరిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డికి వెళ్లే క్రమంలో మేడ్చల్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకొని పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande