మార్చి 31లోగా దేశంలో నక్సలిజం అంతం: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
గౌహతి, 21 ఫిబ్రవరి (హి.స.) మార్చి 31 లోగా దేశం నుంచి నక్సలిజాన్ని(Naxalism) నిర్మూలించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్లో శనివారం ఆయన పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఆ
అమిత్ షా


గౌహతి, 21 ఫిబ్రవరి (హి.స.)

మార్చి 31 లోగా దేశం నుంచి నక్సలిజాన్ని(Naxalism) నిర్మూలించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్లో శనివారం ఆయన పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఆయన చెప్పారు. అక్కడ రాళ్లు రువ్వే ఘటనలు సున్నాకు పడిపోయినట్లు వెల్లడించారు. మణిపూర్లోనూ వర్గ హింసను ఆ దళాలు కట్టడి చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్లలో మావోయిస్టుల వెన్ను విరిచినట్లు సీఆర్పీఎఫ్ను మంత్రి షా కీర్తించారు. సీఆర్పీఎఫ్పై నమ్మకంతో కాన్ఫడెంట్గా చెబుతున్నానని, దేశంలో 2026 మార్చి 31వ తేదీ వరకు నక్సల్ సమస్యను నిర్మూలించనున్నట్లు షా తెలిపారు.

చత్తీస్ ఘడ్-తెలంగాణ బోర్డర్లో ఉన్న కర్రెగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను చేపట్టిన దళాలపై మంత్రి షా ప్రశంసలు కురిపించారు. ఆ ఆపరేషన్లో గత ఏడాది ఏప్రిల్, మే మధ్య కాలంలో 31 మంది నక్సల్స్ మరణించారు. సుమారు 46 డిగ్రీల ఎండలో ఆ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. నక్సల్స్ ఆధీనంలో ఉన్న ఆ కొండల్ని విముక్తి చేసేందుకు కేంద్ర రిజర్వ్ పోలీసులు దళాలు అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande