
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.) సన్ సిటీకి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా.. ఇటీవల బాబు జన్మించాడు. ఆరు నెలల వయసున్న బాబుకు స్వల్పంగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే జ్వరంతో వెళ్లిన బాబుకు.. వైద్యులు అత్యవసర సమయాల్లో (Emergency) ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే పసికందు శరీరం రంగు మారిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం గడువు ముగిసిన (Expired) మందులు ఇచ్చిందని, దీనివల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన బాబు కావడంతో అల్లారుముద్దుగా చూసుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు