రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
గాంధినగర్, 21 ఫిబ్రవరి (హి.స.)గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. కారును ట్రక్కు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు తీవ్రగాయాలపాలవ్వగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
seven-killed-in-horrific-road-accident-in-gujarat-526166


గాంధినగర్, 21 ఫిబ్రవరి (హి.స.)గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. కారును ట్రక్కు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు తీవ్రగాయాలపాలవ్వగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్సాద్ జిల్లాలోని కప్రాడా ప్రాంతంలోని కుంభ్ ఘాట్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను అంబా అటవీ ప్రాంతానికి చెందిన నివాసితులుగా గుర్తించారు.

వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు ధృవీకరించారు. కప్రాడా నుంచి నానాపోడాకు కారులో వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి నుంచి వివరాలు సేకరించి, మృతుల బంధువులకు సమాచారమిచ్చారు. ఈ ఘోర రోడ్డుప్రమాదంతో.. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande