వేంకటేశ్వరస్వామి భక్తులా ? ఏసు భక్తులా ?: వైసీపీ నేతలపై భాను ప్రకాష్ ఫైర్
ఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అవలంభించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. దేవుడిని అవమానించే
ttd-board-member-bhanuprakash-fires-on-ysr


ఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అవలంభించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. దేవుడిని అవమానించేలా ప్రవర్తించిన వైసీపీ నేతలకు టీటీడీ నుంచి లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. జగన్ కళ్లలో ఆనందం కోసం.. మండలిలో వైసీపీ సభ్యులు దైవ ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కాళ్లకు చెప్పులు వేసుకుని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వేంకటేశ్వరస్వామి భక్తులా ? ఏసు భక్తులా? అని నిలదీశారు. దేవుడి పట్ల ఇలా చేయడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. వేంకటేశ్వస్వామి భక్తులైతే ఈ విధంగా ప్రవర్తించేవారు కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హిందూ సంప్రదాయంపై దాడి చేశారని, అధికారంలో లేనపుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారన్నారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే ఇదంతా చేస్తున్నారని, పెద్దల సభను రాక్షస సభగా మార్చేశారని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande