
నరసరావుపేట, 22 ఫిబ్రవరి (హి.స.), కారంపూడి, విజయపురి సౌత్, : మానవ నిర్మిత మహాసాగరానికి కూతవేటు దూరంలో విమానం రానున్న రోజుల్లో ఎగరనుంది. నాగార్జునసాగర్లో ఎయిర్పోర్టు నిర్మించాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కూటమి ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణ కలను సాకారం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్సీహెచ్ సహకారంతో ఎయిర్పోర్టు నిర్మించనుంది. త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో భూసేకరణ ప్రక్రియకు ఆమోద ముద్ర వేయాలని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేశారు. డీపీఆర్ కార్యరూపం దాల్చి ఆమోదం లభించిన వెంటనే పనులు చేపడతారు.
2 సాగర్ పరిధిలో 1670.61 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన ఉంది. 103 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. సైట్ క్లియరెన్స్కు ఎంవోసీఏ వేచిచూస్తోంది. రూ.390 కోట్లతో ఎయిర్పోర్టు నిర్మించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ