
, విశాఖపట్నం, 22 ఫిబ్రవరి (హి.స.)
: వేసవి రాకముందే రాష్ట్రంలో భానుడి ఉష్ణ ప్రతాపం మొదలైంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నందిగామ, కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. విశాఖపట్నం, తుని, నరసాపురం, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంపాల్ కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం.. ఈ అల్పపీడనంతో కలసిపోయింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ