ఆసిఫాబాద్ కాంగ్రెస్లో మున్సిపల్ చిచ్చు..! రెండు గ్రూపులుగా విడిపోయిన నాయకులు..
నిర్మల్, 22 ఫిబ్రవరి (హి.స.) ఆసిఫాబాద్ పురపాలక సంఘం వ్యవహారం అక్కడి కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులకు దారి తీసింది. కొంతకాలం నుంచి విభేదాలు అంతర్గతంగా ఉన్నప్పటికీ... తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిని గెలిపించే విషయంలో కాం
Asifabad


నిర్మల్, 22 ఫిబ్రవరి (హి.స.)

ఆసిఫాబాద్ పురపాలక సంఘం

వ్యవహారం అక్కడి కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులకు దారి తీసింది. కొంతకాలం నుంచి విభేదాలు అంతర్గతంగా ఉన్నప్పటికీ... తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిని గెలిపించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వేసిన తప్పటడుగు ఆ పార్టీలో భారీ చీలికను తెచ్చింది. ఈ పరిణామాలు ఒక దశలో సామాజిక వర్గ పోరుకు దారిచూస్తున్నదన్న అభిప్రాయాలు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్తులో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఆయుధం గా మారే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

సెంటర్ పాయింట్.. డీసీసీ అధ్యక్షురాలు..

పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చిన ఆసిఫాబాద్ పురపాలక సంఘం భారత రాష్ట్ర సమితి పార్టీకి అప్పనంగా వెళ్లిపోవడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఈ వ్యవహారం ఇప్పటికే పీసీసీ దాకా వెళ్ళింది. అయితే వ్యవహారం వెనుక ఏం ස。යි రాజకీయంగా బహిరంగ రహస్యం అవుతున్నప్పటికీ... సెంటర్ పాయింట్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మారారు. దీంతో ఆమె తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లకు తోడు నలుగురు ఇండిపెండెంట్ లు మద్దతు ఉన్నప్పటికీ.. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం కాంగ్రెస్ శ్రేణులను మింగుడు పడనీయడం లేదు.

ఇండిపెండెంట్ లు సహకారం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 13వ వార్డు సభ్యురాలు గుండా స్నేహ శ్యామ్ ఓటింగ్ సమయంలో కారు పార్టీకి ఓటు వేసి ఆ పార్టీ అభ్యర్థులు చైర్మన్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆమె ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు చెబుతున్నారు. డిసిసిబి మాజీ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నేత అనిల్ గౌడ్ స్వయంగా ఆమెను కారు పార్టీ వైపు ఓటు వేసేలా ప్రేరేపించినట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నాయి. డిసిసి మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కారణంగా తన భార్య క్రాస్ ఓటింగ్ చేసిందని ఆమె భర్త యువజన కాంగ్రెస్ నేత గుండా శ్యామ్ బహిరంగంగా ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande