
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త
పరిస్థితులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హౌజ్ అరెస్టులతో బీజేపీ నేతలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. హిందువులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై దాడి జరిగి రెండ్రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు స్పీకర్ ఆర తీయకపోవడం దారుణమన్నారు. కేవలం 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కంటే.. రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీధర్ బాబు.. శ్రీధర్ బాబాగా, భట్టి విక్రమార్క భట్టి అక్రమ్ గా మార్చుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు