బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తార్నాకలోని ఆయన ఇంటివద్దకు భారీగా కార్యకర్తలు చేరుకోగా
రామచంద్ర రావు అరెస్ట్


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్

రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తార్నాకలోని ఆయన ఇంటివద్దకు భారీగా కార్యకర్తలు చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కామారెడ్డి వెళ్లి తీరుతానని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాంచందర్ రావు, పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీజేపీ ముఖ్యనాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.

ఎవరూ కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి బహిరంగ సవాల్ చేశారు. కలెక్టరేట్ వద్ద అన్ని విషయాలు తేల్చుకుందామని అన్నారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలోనే రాంచందర్ రావు కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉదయం నుండి ఆయన ఇంటివద్ద పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande