ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాన్సువాడ వెళ్తాం.. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి ల కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో బాన్సువాడ (Bansuwada) వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర నాయకులను ఆదివారం పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ తార్నాక (Tarnaka)లోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర నేత రామచ
రామచంద్రరావు


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి ల కొనసాగుతున్న

వివాదం నేపథ్యంలో బాన్సువాడ (Bansuwada) వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర నాయకులను ఆదివారం పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ తార్నాక (Tarnaka)లోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర నేత రామచందర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాన్సువాడ వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాన్సువాడలో తమ ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపించారు. కారును ధ్వంసం చేసింది కాంగ్రెస్ నేతలే, కానీ తిరిగి మాపైనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రశ్నిస్తే దాడులకు దిగడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని.. అక్కడ మా కార్యకర్తలు తమ కోసం ఎదురుచూస్తున్నారని కామెంట్ చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ బాన్సువాడ వెళ్లి తీరుతామని రామచందర్ రావు స్పష్టం చేశారు, కాదా బీజేపీ నాయకులు కామారెడ్డి, బాన్సువాడ వైపు రాకుండా పోలీసులు జిల్లాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఎటు చూసినా పోలీస్ బలగాలే కనిపిస్తుండటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande