భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అరెస్ట్
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
BJP


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్రావు యత్నించగా.. పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన బయల్దేరడంతో అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రామచందర్రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు భాజపా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande