మావోయిస్టు టాప్ కమాండర్ దేవీ లొంగిపోయారు. ధృవీకరించిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం
చతిస్గడ్, 22 ఫిబ్రవరి (హి.స.) మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, పార్టీ సెక్రెటరీ జనరల్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Maoist Thippiri Tirupati) తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిర
Chhattisgarh


చతిస్గడ్, 22 ఫిబ్రవరి (హి.స.)

మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్,

పార్టీ సెక్రెటరీ జనరల్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Maoist Thippiri Tirupati) తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పరిణామంపై ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ(Chhattisgarh Deputy CM Vijay Sharma) మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల కాలంగా మావోయిస్టు పార్టీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని స్పందించారు. ఆదివారం ఆయన చెప్పారు. మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ఇది ఒక కీలక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. నక్సలిజం అంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రూపొందించిన జాతీయ స్థాయి వ్యూహమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం భద్రతా బలగాలకు ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ఫలితంగానే సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. నక్సలిజం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు కేవలం కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే యాక్టీవ్గా ఉన్నారు. మిగిలిన వారితో కూడా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని విజయ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలోకి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ.. 1982లో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులైన తిరుపతి అప్పట్లోనే నక్సల్ ఉద్యమం కోసం అడవి బాట పట్టారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన తొలి దళానికి తిరుపతి కమాండర్గా పనిచేసినట్లు సమాచారం. తిరుపతికి దేవ్ జీతోపాటు అనేక మారుపేర్లతో పిలుస్తారు. సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో తిరుపతి పనిచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande