
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy)కి ఇవాళ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌన్సిలర్ యాదగిరి (Councilor Yadagiri) కిడ్నాప్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అదేవిధంగా కిడ్నాప్కు గురైనట్లుగా భావిస్తున్న కౌన్సిలర్ యాదగిరికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. అయితే, వారెవరూ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్రహీంపట్న మండల పరిధిలోని ఎలిమినేడులో ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి నివాసానికి నోటీసులు అంటించారు. ఇక హైదరాబాద్ లోని నివాసానికి వెళ్లి నోటీసులను అందజేశారు.
తాజాగా, జారీ చేసిన నోటీసులకు సంబంధించి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కిడ్నాప్ (Kidnap) కేసులో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా స్పందించని పక్షంలో బాధ్యులపై చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడికి ఒకేసారి నోటీసులు జారీ కావడంతో ఇబ్రహీంపట్నం పాలిటిక్స్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో పోలీసుల విచారణలో బహిర్గతం కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు