
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)మూసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదన్నారు.
‘‘మూసీ పరివాహక ప్రాంతం శుభ్రపడితే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ను గుర్తుపెట్టుకుంటారనే భయం బీఆర్ఎస్ నేతల్లో ఉంది. గతంలో హుస్సేన్సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తానని కేసీఆర్ బడాయి కబుర్లు కెపపారు. మూసీ కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పి నగర ప్రజలను కేటీఆర్ మోసం చేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ జరుపుతోంది. నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాళ్లు సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తాం. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని హరీశ్రావు ప్రయత్నిస్తున్నారు. ఓ అపార్ట్మెంట్కు నోటీసులు ఇచ్చామని అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మల్లన్నసాగర్ కోసం 14 గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు హరీశ్రావుకు ఇవి గుర్తులేదా?మూసీ నిర్వాసితులు ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దు’’ అని బల్మూరి వెంకట్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్