'సర్కారుకు పంతాలు పట్టింపులు వద్దు..: హరీష్ రావు
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) ప్రభుత్వానికి పంతాలు, పట్టింపులు ఎలాంటి భేషజాలు వద్దని.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సర్కారును డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మ
హరీష్ రావు


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) ప్రభుత్వానికి పంతాలు, పట్టింపులు

ఎలాంటి భేషజాలు వద్దని.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సర్కారును డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఇటీవల సర్కార్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం జారీ చేసిన నోటీసులపై ఆయన వారికి భరోసా ఇచ్చేందుకు ఆదివారం వారిని కలిసి అండగా నిలిచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి తో కలిసి ఆయన మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులను కలిసి వారితో మాట్లాడి మనో ధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని విమర్శించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకోవడం సరికాదని, వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదానీ, అంబానీ కోసం..

బడా కార్పొరేట్ కంపెనీల కోసం అంబానీ, ఆదానిలకు భూములు కట్ట పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర పన్నుతుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. అవసరమైతే హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, మధు పార్క్ రిడ్జ్ వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలకు మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావుతో మంచి అనుబంధం ఉందని, ఇక్కడికి మూడు సార్లు వచ్చారని, ఆయనను తిరిగి అధికారంలోకి తెచ్చుకొని మంచి పాలన సాగిద్దాం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. నోటీసులపై ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

20 రూపాయలు పెట్టి వాటర్ ట్యాంకులో విషం కలిపి ఇస్తే తామంతా చనిపోతామని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైందని హరీష్ రావు ధ్వజమెత్తారు. అపార్ట్మెంట్ నుంచి ఐదారు గురు ప్రతినిధులు ఇతలతో కలిసి తమ దగ్గరికి వస్తే కార్యాచరణ ఆలోచిద్దామని హరీష్ రావు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande