హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోపిడి.. హరీష్ రావు ఫైర్
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆర్ లేదు.. ఎన్టీఎల్ తేలలేద
హరీష్ రావు


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)

కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆర్ లేదు.. ఎన్టీఎల్ తేలలేదు.. అనుమతులు లేవు.. ఏ చట్టం ప్రకారం ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇండ్లు కూల్చే బదులు నీళ్ల ట్యాంకులో విషం కలిపి చంపండి అని తల్లులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదా అని ప్రశ్నించారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డి తదితరులు కలిసి పరామర్శించారు.

మేం మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదని హరీశ్రావు స్పష్టం చేశారు. ఎస్టీపీలు కట్టు, మురుగునీరు రాకుండా చెయ్, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చెయ్. కానీ మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప.. ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande