పేదల ఇళ్లు కూల్చి బడా బాబులకు భూములు కట్టబెట్టే కుట్ర: హరీశ్రావు
మూసీ సుందరణ పేరిట సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు
Harishrao


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)మూసీ సుందరణ పేరిట సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం వేసే ప్రతి అడుగు వెనుకా భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉందన్నారు.

‘‘పేదల ఇళ్లు కూల్చి బడాబాబులకు భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. కేసీఆర్ మంచినీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. రేవంత్రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నారు. డీపీఆర్ లేదు.. ఎఫ్టీఎల్ తేలలేదు.. అనుమతులు లేవు. ఏ చట్టం ప్రకారం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తున్నారు? మధు పార్క్ అపార్ట్మెంట్కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పేదల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’అని హరీశ్రావు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande