
నిజామాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య నెలకొన్న సవాళ్లు ప్రతిసవాళ్లతో కామారెడ్డిలో యుద్ధ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ వేదికగా తేల్చుకుందామంటూ ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Katipally Venkataramana Reddy), కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ (Shabir Ali)కి బహిరంగ సవాల్ విసిరారు. కలెక్టరేట్ వద్దే అన్ని విషయాలు తేల్చుకుందామని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. అయితే, ఎమ్మెల్యే కావాలనే ప్రధాన సమస్యను పక్కదారి పట్టించడానికి (Issue Diversion) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు కామారెడ్డి పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు