
అమరావతి, 22 ఫిబ్రవరి (హి.స.)ఆన్లైన్ పుడ్ డెలివరీ చేసినప్పుడు చూడముచ్చటగా ఉండే ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి వేడి ఆహారం గుమ్మం ముందుకు వస్తుంది. గిన్నెలు ఖాళీ చేశాక వాటిని చక్కగా శుభ్రం చేసి వంటగదిలో పేర్చేస్తారు. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయని, వీటి వల్ల ఎలాంటి హాని జరగదని అందరూ అనుకుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ అలవాటు ఉంటుంది. దీనిపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ నందితా అయ్యర్ తన ఎక్స్ ఖాతాలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఫుడ్ డెలివరీకి వినియోగించే నల్ల కంటైనర్లు అంత సురక్షితం కాదని హెచ్చరించారు. నల్లటి ప్లాస్టిక్ ఎలా తయారవుతుందో, అది ఆహారంతో ఎలా స్పందిస్తుందో ఆమె తన పోస్టులో వివరించారు.
దాదాపు అన్ని రెస్టారెంట్లు ఆహారాన్ని డెలివరీ చేయడానికి వీటిని ఉపయోగిస్తాయి. ఈ కంటైనర్లను పారవేయడానికి చాలా మందికి వెనకాడుతుంటారు. నిజానికి ఈ నల్ల ప్లాస్టిక్ కలుషితమైన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా తయారు చేస్తారు. ఈ వ్యర్థాలలో పాత టీవీలు, రిమోట్ల వంటి ఎలక్ట్రానిక్స్ అవశేషాలను, PVC స్క్రాప్లు వంటి రకరకాల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంటాయి. ఈ పదార్థాలతో తయారు చేసిన ప్లాస్టిక్లో వేడి ఆహారాల ఉంచడం సురక్షితం కాదు. ఈ కంటైనర్లు వేడికి స్పందించే విధానం మరింత ఆందోళన కలిగించే విషయం. తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్లకు నల్ల రంగును ఉపయోగిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV