MLA రాజాసింగ్ను అడ్డుకున్న పోలీసులు.. బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు
మెదక్, 22 ఫిబ్రవరి (హి.స.) మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్ బాన్సువాడ వెళుతుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Raja Singh


మెదక్, 22 ఫిబ్రవరి (హి.స.)

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ వద్ద

ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్ బాన్సువాడ వెళుతుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే బాన్సువాడ బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును సైతం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకుల ఇంట్ల వద్ద పోలీసులు మోహరించారు. ఎవరూ బాన్సువాడ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. బీజేపీ నాయకులను జిల్లాలోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ నాయకులు వెళ్లడం పక్కన పెడితే రాజాసింగ్ బాన్సువాడకు బయలుదేరడం ఇప్పుడు ఆశ్యర్యకరంగా ఉంది. బీజేపీకి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసలు పార్టీలోని లేని రాజాసింగ్ బాన్సువాడకు బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande