మావోయిస్టు కీలక నేత దేవ్ జీ రాకతో మా ప్రపంచం తిరిగి వచ్చినట్టే.. తమ్ముడి కూతురు భావోద్వేగ వీడియో
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు దేవీ జీ (Devji) అలియాస్ తిపిరి తిరుపతి (Thipiri Tirupati) లొంగిపోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడి కుమార్తె తిప
మావోయిస్టు


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)

మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర

కమిటీ సభ్యుడు దేవీ జీ (Devji) అలియాస్ తిపిరి తిరుపతి (Thipiri Tirupati) లొంగిపోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడి కుమార్తె తిపిరి సుమ (Thipiri Suma) సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను, వీడియోను విడుదల చేశారు. దేవ్ జీ రాక కోసం వారి కుటుంబం ఎంతలా ఎదురుచూస్తోందని ఆ వీడియోలో ప్రస్తావించారు.

ఎన్నో ఏళ్ల ఎదురుచూపు..

నిజమైతే బాగుండుననే ఆశ.. ఇప్పుడు నిజమయ్యే రోజు దగ్గరకు వచ్చిందేమో అని సుమ అన్నారు. దేవ్ జీ లొంగుబాటు కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదని, అది ఒక కుటుంబం యొక్క దశాబ్దాల నిరీక్షణ అని పేర్కొన్నారు. తన కొడుకు ఎప్పటికైనా తిరిగి రావాలని ఆ వృద్ధ తల్లిదండ్రుల ఆశ అని అన్నారు. తన అన్నను ఒక్కసారైనా చూడాలని రక్తం పంచుకుని పుట్టిన సోదరుడు పరితపిస్తున్నారని కామెంట్ చేశారు. మరోవైపు పెద్దనాన్న క్షేమంగా తిరిగి రావాలని తమ్ముడి పిల్లలమైన తాము ప్రార్థనలు చేస్తుమని సుమ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఆయనే మా కొండంత ధైర్యం..

'దేవ్' రాక ఒక మనిషి రాక కాదు.. మా ప్రపంచం తిరిగి వచ్చినట్లేనని సుమ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనే మాకు ఓ ఆశ, ఒక నమ్మకం, కొండంత ధైర్యమని తెలిపింది. ఈ లొంగుబాటు నిర్ణయం దేవ్ జీ ఇష్టపూర్వకమైతే అది తమ కుటుంబం చేసుకున్న అదృష్టమని, అందుకు సహకరిస్తున్న ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande