టీజీఐఐసీ పరిధిలోనూ బిల్డ్ నౌ ద్వారానే బిల్డింగ్ పర్మిషన్లు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం..
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) డిజిటల్ గవర్నెన్స్ వైపు సాహసోపేతమైన అడుగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత భవన అనుమతి వేదిక ''బిల్డ్ నౌ''ను అమలు చేస్తుంది. అయితే ఈ పద్దతిని తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) పరిధిలోనూ
మంత్రి దుద్దిల్ల


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)

డిజిటల్ గవర్నెన్స్ వైపు సాహసోపేతమైన అడుగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత భవన అనుమతి వేదిక 'బిల్డ్ నౌ'ను అమలు చేస్తుంది. అయితే ఈ పద్దతిని తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) పరిధిలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో విజయవంతంగా అమలు చేస్తున్న సర్కార్.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే బిల్డింగ్ పర్మిషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో టీజీఐఐసీలోనూ అమలుకు కసరత్తు చేస్తుంది. అందుకే అన్ని ప్రభుత్వ విభాగాల్లో 'బిల్డ్ నౌ' అమలు చేసేందుకు డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)కి బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించిన ఇంటిగ్రేషన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు.

టీజీఐఐసీ పరిధిలో...

పటాన్ చెరు, శంషాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి జోన్లలో 148 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వీటిల్లో 84 ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ ఆథారిటీ(ఐలా)లు ఉన్నాయి. వీటి పరిధిలో డీపీఎంఎస్ ద్వారా బిల్డింగ్ పర్మిషన్లు జారీచేస్తున్నారు. ఇక నుంచి 'బిల్డ్ నౌ' ద్వారానే బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. టీజీఐఐసీ పరిధిలో దీనికి సంబంధించిన స్టాఫ్ట్ వేర్ రూపొందించే పనులు జరుగుతున్నాయి. సైబరాబాద్, మేడ్చల్ - సిద్ధిపేట్లు ఈ పరిధిలోనే ఉన్నాయి.

టీజీబీపాస్, డీపీఎంఎస్లకు స్వస్తి...

రాష్ట్రంలోని హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 2016 నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్)ను జూన్ 2024 వరకు అమలు చేశారు. 1 జులై 2024 నుంచి టీజీబీపాస్ తీసుకొచ్చారు. ఈ సాఫ్ట్ వేర్లో సర్వర్ సమస్యలు తలెత్తాయి. దీంతో దీని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో 'బిల్డ్ నౌ' అనే కొత్త సాఫ్ట్ వేర్ను తీసుకొచ్చింది. అయినా డీపీఎంస్, టీజీబీపాస్ పెండింగ్ ఫైళ్లను వీటి ద్వారా పరిష్కరించారు. ఇక నుంచి ఈ రెండు సాఫ్ట్ వేర్ లకు స్వప్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిక పెండింగ్ ఫైళ్లను 'బిల్డ్ నౌ'లోకి వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande