
పెద్దపల్లి, 22 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
(Duddilla Sridhar babu) చొరవతో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన 266 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయి.పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, మల్హర్ రావు, పలిమెల మరియు ఇతర మండలాలకు సంబంధించిన సీఎంఆరెఫ్ 266 చెక్కులను లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ మంజూరు చేయించారు. మంజూరైన చెక్కుల విలువ సుమారు రూ.1 కోటి 9 వేలు లబ్దిదారులకు అందజేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయం నుంచి తెలిపారు. చెక్కులను మంజూరు చేయించినందుకు మంత్రి శ్రీధర్ బాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు