పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలి మంత్రి పొంగులేటి
ఖమ్మం, 22 ఫిబ్రవరి (హి.స.) ఎన్నికల వరకే రాజకీయం.. గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరఫున పేదవాడికి సేవ చేయాల్సిందే. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలి అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్
మంత్రి పొంగులేటి


ఖమ్మం, 22 ఫిబ్రవరి (హి.స.)

ఎన్నికల వరకే రాజకీయం.. గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరఫున పేదవాడికి సేవ చేయాల్సిందే. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలి అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వారు ఖమ్మం జిల్లా పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో ఏదులాపురం నూతన మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత బాధ్యతల స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి నూతన ప్రజాప్రతినిధులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేశారు. ప్రజలు నమ్మి ఓటేశారని, కేవలం కుర్చీలకే పరిమితం కాకుండా నిత్యం క్షేత్ర స్థాయిలో ఉండాలని ఆదేశించారు. ప్రతి కౌన్సిలర్ వారంలో ఐదు రోజులు, ఉదయం పూట రెండు గంటలు తప్పనిసరిగా వార్డుల్లో పర్యటించాలి. ప్రతి పనికి నిధులు అవసరం లేదు, మీరు బాధ్యతగా తిరిగితేనే అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపడుతుంది అని ఆదేశాలు జారీ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని, తాగునీటి సమస్యలు, మురికి నీరు నిలవకుండా చూడటం, నాలాల కబ్జాలను అడ్డుకోవడంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ప్రతి వార్డు సమస్య పై కౌన్సిలర్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande