ఆఫ్ఘనిస్థాన్పై విరుచుకుపడిన పాకిస్తాన్.. ఒకే కుటుంబంలో 17మంది మృతి
ఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.) పాకిస్థాన్, ఆఫ్ఘని మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరవాత పాక్ సరిహద్దుల్లోని ఆఫ్ఘన్ ప్రావిన్సులలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో చిన్నపి
Pakistan attack


ఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.)

పాకిస్థాన్, ఆఫ్ఘని మధ్య ఉద్రిక్తతలు

కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరవాత పాక్ సరిహద్దుల్లోని ఆఫ్ఘన్ ప్రావిన్సులలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో చిన్నపిల్లలు, మహిళలు సహా డజన్ల కొద్ది మరణించారు. మరణించినవారిలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ అధికారులు ప్రజలు మరణించినట్టు ధృవీకరించారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటన చేశారు.

నిన్న రాత్రి నంగర్హార్ మరియు పాక్టికా ప్రావిన్సులలోని ఆఫ్ఘన్ ప్రజలపై బాంబు దాడి చేశారు. మహిళలు, పిల్లలు సహా డజన్ల కొద్దీ ప్రజలను చంపారు. పాక్ జనరల్ ఇలాంటి నేరాల ద్వారా వాళ్ల దేశ భద్రత బలహీనతను భర్తీ చేసుకుంటారు అని పేర్కొన్నారు. మరోవైపు పాక్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. పాక్ సైన్యం చేసిన వైమానిక దాడుల్లో ఒక కుటుంబంలో 19మంది ఉంటే వారిలో 17 మంది మరణించారని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు పాక్ దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande