
మీరట్ యూపీ, 22 ఫిబ్రవరి (హి.స.)ప్రధాని మోడీ నేడు మీరట్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మీరట్ మెట్రో, శతాబ్ది నమో భారత్ కారిడార్ను ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం మోడీ శతాబ్ది నగర్ నుండి మీరట్ సౌత్ స్టేషన్ వరకు అందులో ప్రయాణించారు. నమోభారత్ ఇండియాలోని మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఇది సాధారణ రైళ్ల కంటే వేగంగా ప్రయాణించి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మరింత తగిస్తుంది. మీరట్ మెట్రో మీరట్లో ప్రయాణిస్తే, నమో భారత్ మెట్రో మీరట్, ఢిల్లీ నగరాల మధ్యన ప్రయాణిస్తుంది.
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.12,930 కోట్లు ఖర్చు చేశారు. ఈ మెట్రో వల్ల ఢిల్లీ మీరట్ మధ్య 55 నిమిషాల ప్రయాణ సమయం తగ్గనుంది. నమోభారత్ రైళ్లు గంటలకు 180 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. కాగా ఢిల్లీ నుండి మీటర్ ప్రయాణంలో ఇవి గంటలకు 90కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. ఇక మీరట్ మెట్రో రైళ్లను భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకుని నిర్మించారు. ఈ మెట్రో గంటకు 120 కి.మీ వేగంతో ప్రయానించనుంది. మీరట్ మెట్రో 21 కి.మీ మార్గంలో ప్రయాణించడానికి 30 నిమిషాల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు