తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్ ని ఖండించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కామారెడ్డిలో నెలకొన్న పరిస్థితులపై కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపిం
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్

రావు అరెస్ట్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కామారెడ్డిలో నెలకొన్న పరిస్థితులపై కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉంటే కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ స్థలం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం మొదలైంది.

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తరవాత నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన తండ్రి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములను అరోరా కాలేజీలకు కట్టబెట్టారని ఆరోపించారు. దీంతో ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో వివాదం మరింత పెద్దగా మారింది. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో బీజేపీ ఎమ్మెల్యేకు మద్దతుగా రాంచందర్ రావు బయలుదేరగా ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు బీజేపీ ముఖ్యనాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande