
అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.)ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఈ రోజు (ఫిబ్రవరి 23) నుంచి ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం అయింది.
తొలి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ (Intermediate) వార్షిక పరీక్షలు నేటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టైట్ టేబుల్ ప్రకారం పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలని అధికారులు సూచించారు. ‘ఒక్క నిమిషం’ (One Minute) ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులు కనీసం అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
విద్యార్థులు కనీసం ఒక గంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 2025లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం (సుమారు 90% పైగా) నమోదైంది.పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్ సహా ఎలాంటి గాడ్జెట్ లకు చోటు లేదు. ప్రతి కేంద్రం వద్ద సిసి కెమెరాల నిఘా, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎండలు మొదలు కావడంతో ప్రతి కేంద్రంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యాలు అధికారులు కల్పించారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV