రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS అధికారి సునీల్ కుమార్ అరెస్ట్
గుంటూరు , 23 ఫిబ్రవరి (హి.స.) రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial Torture Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (IPS Sunil Kumar)ను గుంటూరు నగరంపాలెం పోలీసులు బీహార్ (Bihar)లో అరె
raghuramakrishna-raju-custodial-torture-case..-ips-officer-sunil-kumar-arreste


గుంటూరు , 23 ఫిబ్రవరి (హి.స.)

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial Torture Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (IPS Sunil Kumar)ను గుంటూరు నగరంపాలెం పోలీసులు బీహార్ (Bihar)లో అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందని నమోదైన కేసులో సునీల్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన, రఘురామపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే, తాజాగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు సునీల్ కుమార్ బీహార్లో తలదాచుకున్నట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా పక్కా సమాచారం అందింది. దీంతో గుంటూరు నగరంపాలెం పోలీసుల స్పెషల్ టీమ్ బీహార్ వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై విచారణ జరుగుతుండగా.. సునీల్ కుమార్ అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande