
విజయనగరం , 28 ఫిబ్రవరి (హి.స.), సీఎం చంద్రబాబు శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి రానున్నారు. ఆ నియోజకవర్గంలో నిర్వహించే హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీలో, రావివలసలో జరిగే ప్రజావేదికలో పాల్గొంటారు. చీపురుపల్లి ఏరియా ఆసుపత్రిలో జరిగే హెచ్పీవీ వ్యాక్సినేషన్కు హాజరవుతారు. ఇదే కార్యక్రమాన్ని రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలస నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా పాల్గొంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వచ్చిన బాలికలతో సీఎం నేరుగా మాట్లాడతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ