
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గాంధీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, హోంగార్డు ఇద్దరు బాధితుని వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇటీవల కీసర నితిన్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. తోటకూర మహేష్ యాదవ్ మృతి చెందాడు. ఈ విషయంలో గాంధీ హాస్పిటల్ పీఎంఓ రిపోర్ట్ ఇవ్వడంలో గాంధీ హాస్పిటల్ డాక్టర్ సందీప్ కీసర హోంగార్డు బాధితుని వద్ద రెండు లక్షల రూపాయలు లంచం అడిగారు. బాధితుడు అంత అమౌంట్ ఇవ్వలేను అని లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోస్ట్మార్టం రిపోర్ట్ విషయంలో బాధితుడి నుంచి 40 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం డాక్టర్ సందీప్, హోమ్ గార్డు నాగేష్ లను కీసర పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు