అది తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ మరియు జనరల్ కౌన్సిల్ మీటింగ్ 2025-26 కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ మరియు జనరల్ కౌన్సిల్ మీటింగ్ 2025-26 కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిల్డర్స్కు పిలుపునిచ్చారు.

రోడ్లు బలంగా ఉంటేనే పెట్టుబడులు..

'ప్రభుత్వాలు ప్రణాళికలు వేస్తాయి. బడ్జెట్లు కేటాయిస్తాయి. ప్రాజెక్టులు ప్రకటిస్తాయి. కానీ ప్రణాళికలకు ప్రాణం పోసేది మీరు మీరు వేసే రోడ్లు ప్రజల ప్రయాణాన్ని సులభం చేస్తాయి. మీరు నిర్మించే వంతెనలు దూరాలను తగ్గిస్తాయి. మీరు కట్టే భవనాలు సేవలకు నిలయాలు అవుతాయి. అందుకే నిర్మాణ రంగం అంటే నాకు కేవలం కాంట్రాక్ట్ కాదు - అది రాష్ట్ర నిర్మాణం. అభివృద్ధికి ప్రధాన పునాది మౌలిక వసతులే. రోడ్లు బలంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. కనెక్టివిటీ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి. అందుకే మేము రోడ్లు & భవనాల రంగంలో భారీగా పనులు చేపట్టాం. ప్రస్తుతం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. హైబ్రిడ్

ఇది అన్యుటీ మోడల్(హ్యామ్) ప్రాజెక్టులు, రీజినల్ రింగ్ రోడ్, నేషనల్ హైవేల విస్తరణ, స్టేట్ హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు - ప్రతి ప్రాంతంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రీజినల్ రింగ్ రోడ్ తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్. హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే కాదు, చుట్టుపక్కల జిల్లాల్లో కొత్త అభివృద్ధి మార్గాలను తెరుస్తుంది. ఇది ఆర్థిక కారిడార్లకు దారి తీస్తుంది' అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande