
, కడప-, 28 ఫిబ్రవరి (హి.స.) పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండేళ్ల తర్వాత సీబీఐ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్, సాక్షిగా ఉన్న భరత్కుమార్ యాదవ్ సోదరులు కిరణ్కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్లను పులివెందుల పోలీస్ స్టేషన్లో సీబీఐ అధికారులు శుక్రవారం విచారించారు. విచారణకు తొలుత మహేంద్ర హాజరయ్యారు. కిరణ్ సాయంత్రం వచ్చారు. వివేకా హత్య చోటుచేసుకున్న రోజు తెల్లవారుజామున 1.42 గంటలకు అర్జున్రెడ్డి అనే వ్యక్తికి కిరణ్కుమార్ వాట్సప్ కాల్ చేశారు.
వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే కిరణ్, మహేంద్ర మధ్య సాగిన ఫోన్ సంభాషణలపై కూడా విచారించారు. కిరణ్ బంధువు కావడంతో గతంలో ఫోన్లో మాట్లాడుకున్నట్లు మహేంద్ర సమాధానం ఇచ్చారు. కిరణ్ తన సోదరుడు సునీల్తో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చారు. వీరిని రెండు గంటల పాటు సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ విచారించారు. కాల్డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ