శాసన మండలిలో.కీలక పరిణామం.చోటుచేసుకుంది
అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.), శాసనమండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ ను గురువారం పాలకపక్షమే అడ్డుకుందని చైర్మన్ మోషేన్రాజు అన్నారు. చైర్ను అవమానించారని ఆరోపించారు. దీనిని మంత్రు లు, టీడీపీ ఎమ్మెల్సీలు ఖండించారు. చర్చను
శాసన మండలిలో.కీలక పరిణామం.చోటుచేసుకుంది


అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.), శాసనమండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ ను గురువారం పాలకపక్షమే అడ్డుకుందని చైర్మన్ మోషేన్రాజు అన్నారు. చైర్ను అవమానించారని ఆరోపించారు. దీనిని మంత్రు లు, టీడీపీ ఎమ్మెల్సీలు ఖండించారు. చర్చను వైసీపీయే అడ్డుకుందని చెప్పారు. శుక్రవారం మండలి సమావేశం ప్రారంభం కాగానే.. చైర్మన్ మాట్లాడారు. ‘నిన్నటి రోజు(గురువారం) సభ పునఃప్రారంభమైనప్పుడు.. ప్ర శ్నోత్తరాలను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్ జరిపించాలని అడిగి.. లడ్డూ ప్రసాదంపై లఘు చర్చను అడ్డుకునే ప్రయ త్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఆర్థిక మంత్రి నాపై కొన్ని సత్యదూరమైన ఆరోపణలు చేయడం కూడా కరెక్టు కాదు. లఘు చర్చ జరిపే సన్నాహక చర్యల్లో భాగం గా సెక్రటరీ జనరల్ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి లఘు చర్చ టాపిక్పై నోట్స్ పంపిన ప్రతిని చూపించి.. స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి, సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. అదీ కరెక్టు కాదు. ఇరు పక్షాల సభ్యులూ సభ గౌరవాన్ని పెంపొందించే విధంగా నడుచుకోవాలని తెలియజేసుకుంటున్నా’ అని తెలిపారు.

పలువు రు మంత్రులు, అధికార పార్టీ సభ్యులు తమ స్థానాల వద్ద నిలబడి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడి న దానిపై క్లారిటీ ఇవ్వాలి కదా అని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడే ప్రయత్నం చేయ గా.. వద్దని చైర్మన్ వారించారు. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు సార్ సార్ అంటుండగా.. ‘వదిలేయండి.. చైర్ను ఇంకా అవమానించాలనుకుంటే కరెక్టు కాదు’ అని మోషేన్రాజు అన్నారు. మీరంటే మాకు అపారమైన గౌరవం ఉందంటూ మంత్రులు అచ్చెన్నాయు డు, మనోహర్, బాలవీరాంజనేయస్వామి, పలువురు టీడీపీ సభ్యులు అన్నారు. వారు చైర్మన్ సీటును అగౌరవపరిచారని వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. చైర్మన్ జోక్యం చేసుకుని.. ‘జరిగింది నాకు.. మీకు సంబంధం లేదు కదా’ అని వారినుద్దేశించి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande