తెలుగు రాష్ట్రాల్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
Vaccintion


హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దేశ వ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు దీనిని ఇస్తున్నారు. రాజస్థాన్లో ప్రధాని మోదీ జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని కింగ్కోఠి జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యాక్రమ్యంలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పాల్గొని వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కోటీ 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande