టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు.. యుద్ధ నీడలో ఇరాన్.. స్కూళ్లు, కార్యాలయాలు మూసివేత!
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.) ప్రపంచంలో మరో యుద్ధం ప్రారంభం అయింది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్ (Iran) లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) తన క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran)పై ఇజ్రా
Israel attack


ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.) ప్రపంచంలో మరో యుద్ధం ప్రారంభం

అయింది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్ (Iran) లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) తన క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran)పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడటంతో నగరం అంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సైనిక స్థావరాలను, కీలక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి టెహ్రాన్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లడం తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రభుత్వం ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని అన్ని విద్యాసంస్థలు (స్కూళ్లు, కాలేజీలు) ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంపై గగనతల ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సైన్యం వెల్లడించింది. అలాగే ఇరాన్ తిరిగి దాడులు చేసేందకు ప్రయత్నించే అవకాశం ఉండటంతో అప్రమత్తం అయిన ఇజ్రాయెల్ దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిన ప్రకటించి తమ పౌరులను అప్రమత్తం చేసింది. అలాగే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది.

మరోవైపు, ఇజ్రాయెల్ అంతటా క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో సైరన్లు మోగాయి. క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు (Protected spaces) తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) కీలక ఆదేశాలు జారీ చేసింది. సెల్ ఫోన్లకు నేరుగా అలర్ట్ సందేశాలను పంపుతూ ప్రజలను ముందస్తుగా సిద్ధం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande