
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. కేబిఆర్ పార్క్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ సిటీ లో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు ప్రాజెక్టులుగా నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం.. ప్రాజెక్టు -1 లో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -2 నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ నిర్మాణంతో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా కేబిఆర్ పార్క్ జంక్షన్ మారనున్నది. సాగర్ సొసైటీ వద్ద నిర్మించే అండర్ పాస్ తో ఆ జంక్షన్ లో కూడ సింగ్నల్ ఫ్రీ కి అవకాశం ఉంది. ప్రాజెక్టు-2 లో క్యాన్సర్ హాస్పిటల్ నుండి అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, రోడ్డు నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. రానున్న రెండేళ్ళలో అన్ని ప్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవాల్టి నుండి నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు పలు చోట్ల మళ్లింపులు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు చేశారు. సాగర్ సొసైటీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు.. నిర్మాణ సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ప్రారంభం పనుల వద్ద రూట్ పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు & రోడ్ ఇంజనీరింగ్ అధికారులు.
కేబీఆర్ పార్క్ నుండి సాగర్ సొసైటీ రూట్ లో అవసరాన్ని బట్టీ రెండు వైపుల సింగిల్ రోడ్ లో వాహనాల రాకపోకలు సాగించేందుకు నిర్ణయించారు. రెండున్నర నెలల వ్యవధిలో పిల్లర్స్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రూ. 1000 కోట్లతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండున్నర ఏళ్ల వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారుల ప్లాన్. వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు