
ఢిల్లీ,, 28 ఫిబ్రవరి (హి.స.)
ఈ రోజు ఉదయం అమెరికా,
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నేరుగా వెళ్లి ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ పై క్షిపణులు దాడులు చేశాయి. దీంతో దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. తమపై జరిగిన దాడికి ఇరాన్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ అంతు చూస్తామని ప్రకటించింది. దీంతో ఆ దేశం అంతటా క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) నేరుగా పౌరుల సెల్ ఫోన్లకు అలర్ట్ సందేశాలను పంపుతూ, అందరూ సురక్షిత ప్రాంతాలకు (Protected spaces) సమీపంలో ఉండాలని ఆదేశించింది. క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను ముందస్తుగా సిద్ధం చేసేందుకు ఈ 'ప్రోయాక్టివ్ అలర్ట్' జారీ చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయ పౌరుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలకమైన అడ్వైజరీ ని విడుదల చేసింది. భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా నివాసం, పని ప్రదేశాల్లోని షెల్టర్లకు అందుబాటులో ఉండాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది. అలాగే అత్యవసర సమయాల్లో సహాయంకోసం లేదా ఐడిని +972-54-7520711 నంబర్ను cons1.telaviv@mea.gov.in మెయిల్ సంప్రదించాలని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు