కవితకు భారీ ఊరట
అభియోగాల నుంచి మూడేళ్లకు విముక్తి క్విడ్ప్రోకో ఊహాజనితమేనన్న న్యాయస్థానం
Kavitha


హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)దిల్లీ మద్యం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని దిల్లీ కోర్టు కొట్టివేయడంతో ఆమెకు భారీ ఊరట లభించింది. కవిత అరెస్టు నుంచీ జరిగిన పరిణామాలు అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశాలయ్యాయి. సీబీఐ అధికారులు తొలుత 2022 డిసెంబరులో హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం.. మద్యం కేసులో కవిత తరఫున కార్యకలాపాలు సాగించారంటూ హైదరాబాద్కు చెందిన పలువురిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈడీ అధికారులు 2024 మార్చి 15న కవితను అరెస్ట్ చేసి దిల్లీలోని తిహాడ్ జైలుకు తరలించారు. ఆమె జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. సుమారు 5 నెలల జైలు జీవితం అనంతరం.. అదే ఏడాది ఆగస్టు 27న ఆమె బెయిల్పై విడుదలయ్యారు.

మద్యం కేసులో కవిత (17వ నిందితురాలు)ను కీలక కుట్రదారుగా ప్రాసిక్యూషన్ పేర్కొంది. మద్యం విధానాన్ని సౌత్ గ్రూపునకు అనుకూలంగా మార్చేందుకు రూ.100 కోట్లు వసూలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పగించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. తన అనుచరులు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు గోరంట్ల ద్వారా దిల్లీకి చెందిన విజయ్నాయర్తో కలిసి కవిత ఈ కుట్రకు పాల్పడ్డారని వాదించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande