
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ స్పీకర్ విచారణకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari Disqualification Petition) హాజరయ్యారు. కడియం శ్రీహరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద KP Vivekananda) అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరయ్యారు. గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫు అడ్వకేట్లను కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జాజ్ చేశారు. ఇవాళ కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేయబోతున్నారు.
మార్చి మొదటి వారంలో జడ్జిమెంట్!
పార్టీ ఫిరాయింపులపై మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకకు ఫిర్యాదు రాగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీర్పు వెలువడింది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై మాత్రమే విచారణ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో నిన్నటి విచారణకు దానం నాగేందర్ గౌర్హాజరు అయ్యారు. దీంతో ఆయనకు సంబంధించిన పిటిషన్పై తదుపరి విచారణ మార్చి2కు స్పీకర్ వాయిదా వేశారు. ఇక ఇవాళ కడియం శ్రీహరి విచారణపై ఇవాళ విచారణ పూర్తయితే మార్చి మొదటి వారంలో దానం నాగేందపై దాఖలైన పిటిషన్ పై విచారణ పూర్తి చేసి వీరిద్దరికి సంబంధించిన పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు