రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఫిక్స్.. షెడ్యూల్ను విడుదల చేసిన AICC
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల మార్చి 25 తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున
Rahul Gandhi


హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

వచ్చే నెల మార్చి 25 తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏఐసీసీ (AICC) విడుదల చేసింది. మార్చి 2న ఉదయం 7.10కి రాహుల్ గాంధీ ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరుతారు. ఉదయం 9:20కి రాహుల్ గాంధీ ఒకరోజు హైదరాబాద్లోని శంషాబాద్ చేరుకుంటారు. విమానాశ్రయానికి

అనంతరం10 గంటలకు ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వికారాబాద్కు బయలుదేరుతారు 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్ జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. రోజంతా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4.30కి శిక్షణ ముగిసిన అనంతరం వికారాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. సాయంత్రం 5.303 శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. మరోవైపు రాహుల్గాంధీ పర్యటన దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వికారాబాద్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పర్యటన పొడవునా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande