
వేములవాడ, 28 ఫిబ్రవరి (హి.స.)
వాహనదారుల సురక్షితమైన ప్రయాణం వారి కుటుంబాలకు ధీమాగా ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి మహేశ్ బిగితే అన్నారు. వేములవాడలో రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించగా ఆయన హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరైవ్-ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాట చేసామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం కాగా, వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమన్నారు. ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాలకు చెందిన డ్రైవర్లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని, ప్రజా ట్రాన్స్పోర్టు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్య స్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై వుందన్నారు.
ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అస్కారం అధికమని, రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు సైతం నిరంతం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం క్షేమకరమన్నారు. ప్రజలతోపాటు డ్రైవర్లు కూడా క్షేమంగా ఇంటికి క్షేమంగా చేరుకునే విధంగా సురక్షిత ప్రయాణాలు జరపాలని సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పాలుపంచుకున్న కాత్యాయని, ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రులు, మాతృ శ్రీ శ్రీ వర్ష కంటి, వేములవాడ లయన్స్ క్లబ్ వారికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు