కేరళలో విషాదం: లారీని ఢీకొన్న కారు.. నలుగురు స్నేహితుల మృతి!
కోజికోడ్ 28 ఫిబ్రవరి (హి.స.) ఆనందంగా కారులో వెళ్తున్న నలుగురు స్నేహితులను ఘోర ప్రమాదం (Fatal accident) మృత్యు ఒడిలోకి నెట్టింది. వేగంగా వెళ్తున్న వారి కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు
Road accident


కోజికోడ్ 28 ఫిబ్రవరి (హి.స.)

ఆనందంగా కారులో వెళ్తున్న

నలుగురు స్నేహితులను ఘోర ప్రమాదం (Fatal accident) మృత్యు ఒడిలోకి నెట్టింది. వేగంగా వెళ్తున్న వారి కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతులను రామనాట్టుకరకు చెందిన ధినిల్, ఫెరోక్కు చెందిన అజీష్, విమల్ శ్యామ్లల్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.

కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి, పంతీరంకావుకు చెందిన ధిజిల్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారు అధిక వేగంతో ఉండటమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande