టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..
ఐసీసీ నిర్వహించే అన్ని మ్యాచులు ఒకఎత్తు అయితే.. ఇండియా, పాక్ మ్యాచ్ మరో లెవెల్ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. మరోసారి కూడా త
Cricket


హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)క్రికెట్ ప్రపంచంలో టోర్నీ ఏదైనా , ఆర్గనైజ్ చేసేది ఏ దేశమైనా.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఏ ఐసీసీ టోర్నీలో అయినా సరే... అన్ని మ్యాచులు ఒకఎత్తు అయితే.. ఇండియా, పాక్ మ్యాచ్ మరో లెవెల్ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. టీమిండియా పాకిస్థాన్ను చిత్తుగా ఓడించి.. సూపర్-8లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ను క్రికెట్ అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఇదే టోర్నీలో మరోసారి భారత్ , పాక్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి 26న జరిగిన కీలక మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయం సాధించి.. సెమీస్ రేసులో నిలిచింది. ఈ విజయంతో నెట్ రన్రేట్ -0.100కు మెరుగుపడింది. మార్చి 1న జరిగే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్పై గెలిస్తే గ్రూప్-1లో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్-2 టాపర్తో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. గ్రూప్-2లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిచినా.. గరిష్టంగా రెండో స్థానానికే పరిమితం అవుతుంది. కాబట్టి భారత్ గ్రూప్-1 టాపర్ కాకపోతే ఇండియా-పాక్ సెమీస్ సాధ్యం కాదు. అంటే, భారత్ గ్రూప్-1లో అగ్రస్థానం దక్కించుకుంటేనే ఈ క్లాసిక్ పోరును మరోసారి చూసే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం సౌతాఫ్రికా రెండు మ్యాచ్లకు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. జింబాబ్వేతో మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆదివారం(మార్చి 1న) జరిగే జింబాబ్వే.. దక్షిణాఫ్రికాను ఓడించాలి. అలానే భారత్ వెస్టిండీస్ను భారీ తేడాతో ఓడించి, దక్షిణాఫ్రికా కంటే మెరుగైన నెట్ రన్రేట్ సాధించాలి. అప్పుడు భారత్, సఫారీ జట్లు చెరో 4 పాయింట్లు సమానంగా ఉన్నా...మెరుగైన నెట్ రన్రేట్తో భారత్ టాప్కు చేరుతుంది. ఈ క్రమంలో టీమిండియా, పాక్ సెమీస్లో తలపడే అవకాశం ఉంది. మొత్తంగా సెమీస్లో భారత్, పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువైనా, పూర్తిగా ముగిసిపోలేదు. అందుకే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ భారత్, పాకిస్థాన్ సెమీ ఫైనల్లో తలపడితే, ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్థాన్ కాకుండా వేరే జట్టుతో భారత్ తలపడితే, ఆ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande