రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్..
అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీల
రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్..


అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి.

* శ్రీవారి ఆదాయం కోట్లలో..

– హుండీ ద్వారా – 1,880 కోట్లు

– వడ్డీ ద్వారా – 1,205 కోట్లు

– ప్రసాదాల విక్రయం ద్వారా – 650 కోట్లు

– దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా – 310 కోట్లు

– ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా – 135 కోట్లు

– తలనీలాల విక్రయం ద్వారా – 175 కోట్లు

ఈ విధంగా మొత్తం ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ..

* టీటీడీ వ్యయ కేటాయింపులు (రూ. కోట్లు)

– ఉద్యోగుల జీతభత్యాలకు – 1,859 కోట్లు

– ముడి సరుకుల కొనుగోలుకు – 974 కోట్లు

– ఫిక్స్డ్ డిపాజిట్లకు – 700 కోట్లు

– ఇంజనీరింగ్ పనులకు – 475 కోట్లు

* టీటీడీ పాలకమండలి ముఖ్య నిర్ణయాలు

– విద్యాసంస్థల అభివృద్ధి పనులకు రూ. 118.8 కోట్లు కేటాయింపు.

– భక్తుల కోరిక మేరకు “శ్రీవారి ముడుపు” పథకం ప్రారంభం.

– రూ. 120 కోట్ల వ్యయంతో అత్యాధునిక అన్నప్రసాద సముదాయం నిర్మాణం.

– ఆలయాల నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు సడలింపు.

– ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ నిర్మాణానికి రూ. 20.8 కోట్లు కేటాయింపు.

– కోయంబత్తూర్, గౌహతి, బెలగావి, పాట్నా నగరాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టడం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande