లక్ష్మీనరసింహ స్వామి సేవలో త్రిపుర గవర్నర్
యాదగిరిగుట్ట , 28 ఫిబ్రవరి (హి.స.) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనా రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన.. వీవీఐపీ అతిథి గృహం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లారు.
Tripura governor


యాదగిరిగుట్ట , 28 ఫిబ్రవరి (హి.స.)

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనా రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన.. వీవీఐపీ అతిథి గృహం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లారు. ఆలయ ముఖ మండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వయంభు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం వారికి ప్రధానార్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా.. ఏవో భవానీ స్వామి వారిప్రసాదాన్ని అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande